మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కాబోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ అంచనాలు క్రియేట్ కావడం లేదు. రీసెంట్ గా ఓవర్శీస్ లో ఓ ఈవెంట్ చేశారు. బట్ అదే రోజు తెలంగాణ అసెంబ్లీ, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఉండటంతో అది పెద్దగా వెలుగులోకి కూడా రాలేదు. అదేటైమ్ లో వీళ్లు విడుదల చేసిన ధోప్ సాంగ్ కు సైతం మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. థమన్ మరోసారి ఆడియన్స్ కు నచ్చే పాట ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు అన్నారు. బట్ ఇది పార్టీ సాంగ్ గా కొన్నాళ్ల పాటు దుమ్మురేపే అవకాశం ఉందనేది ఇంకొందరు చెబుతోన్న మాట. ముఖ్యంగా పబ్ కల్చర్స్ లో ఎక్కువగా వినిపించొచ్చు అంటున్నారు. విశేషం ఏంటంటే.. దాదాపు ఇదే టైమ్ లో థమన్ మ్యూజిక్ అందించిన మరో పాట దీనికంటే బావుందనే టాక్ తెచ్చుకుంటోంది.
బాలీవుడ్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బేబీ జాన్. ఈ చిత్రానికీ అస్సలు బజ్ లేదు. ఇప్పటికీ నార్త్ లో పుష్పరాజ్ రూలింగ్ నడుస్తోంది. అందుకే ఈ నెల 25న విడుదల కాబోతోన్న బేబీ జాన్ ఓ హైప్ కోసం తంటాలు పడుతోంది. అలాంటి మూవీకి ‘బేబీ జాన్ బీస్ట్ మోడ్’ అనే సాంగ్ అదరగొడుతూ హైప్ తెచ్చింది. చాలామంది గేమ్ ఛేంజర్ నుంచి ధోప్, బేబీ జాన్ నుంచి బీస్ట్ మోడ్ సాంగ్స్ ను కంపేర్ చేస్తూ థమన్ బెస్ట్ వర్క్ బీస్ట్ మోడ్ లోనే ఉందని చెబుతున్నారు. దీంతో థమన్ ఒకే సారి రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి.
అయితే కొన్ని పాటలు థియేటర్స్ బావుంటాయి. ఇంకొన్ని పాటలు మాంటేజ్ గా కనిపిస్తాయి. బీస్ట్ మోడ్ అనేది మాంటేజ్ సాంగ్. ఇప్పుడు వినడానికి బావున్నా.. తర్వాత అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఇటు ధోప్ సాంగ్ రెగ్యులర్ సాంగ్. సో.. థియేటర్స్ లో ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయొచ్చు.