Deepika Padukone : అల్లు అర్జున్ కోసమే ప్రభాస్ ను పక్కనపెట్టిందా?

Update: 2025-06-04 12:00 GMT

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ సరసన 'స్పిరిట్' సినిమాలో నటించే అవకాశాన్ని దీపికా పదుకొణె కోల్పోయిన విషయం తెలిసిందే. రూ. 20 కోట్ల రెమ్యునరేషన్, 15% షేర్ డిమాండ్స్ను వంగా తిరస్కరించడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పు కుందని సమాచారం. తాజాగా అట్లీ డైరెక్షన్లో రూ.800 కోట్ల బడ్జెట్ తో అల్లు అర్జున్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ఏఏ 22. ఇది టాలీవుడ్లో భారీ హైప్ ను సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ గురించి సస్పెన్స్ నెలకొంది. లేటెస్ట్ బజ్ ప్రకారం, దీపికాకు ఈ సినిమాలో ఎలాంటి షేర్ ఇవ్వడం లేదని, ఆమె కల్కి సినిమాకు తీసుకున్న రెమ్యు నరేషన్నే ఈ సినిమాకు కూడా తీసుకుంటుందని తె లుస్తోంది. కల్కి కోసం ఆమె రూ.15 కోట్లు + జీఎస్ టీ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రెమ్యునరేషన్ విషయంలో ఆమె ఎందుకు తగ్గిందని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. బహుశా స్పిరిట్ డేట్స్ కంటే ఏఏ22 సినిమా డేట్స్ తక్కువ అడిగి ఉంటారనే కామెంట్స్ వస్తు న్నాయి. అలాగే ఆమె డిమాండ్స్లో కొన్నింటికి ఓకే చెప్పి ఉండవచ్చనేది మరో వాదన.

Tags:    

Similar News