Srinidhi Shetty : కేజీఎఫ్ తో బ్రేక్ రాలే.. హిట్ 3తో వస్తుందా..?

Update: 2025-04-29 11:30 GMT

ప్యాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీలో హీరోయిన్ గా నటించడం అంటే ఆమె కెరీర్ ఎక్కడికో పోతుంది అనేందుకు సంకేతం. కానీ రెండు భాగాల్లో కనిపించినా.. ఆ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు హీరోయిన్ శ్రీనిధి శెట్టికి. ఈ కన్నడ సోయగానికి ఈ సినిమాలో నిరూపించుకోవడానికంటూ ఏం రాయలేదు దర్శకుడు ప్రశాంత్ నీల్. అందుకే తను, తన పాత్ర తేలిపోయాయి. ఆ తర్వాత తనకూ ఊహించిన ఆఫర్స్ అంటూ ఏం రాలేదు కూడా. ఇన్నాళ్ల తర్వాత మరో ప్యాన్ ఇండియా సినిమాగా చెబుతోన్న ‘హిట్ 3’తో ఆడియన్స్ ముందుకు వస్తోంది. మే 1న విడుదల కాబోతోన్న హిట్ 3 శ్రీనిధికి ఫస్ట్ బిగ్ బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉంది.

ఈ చిత్రంలో తను మృదుల అనే పాత్రలో నటిస్తోందని చెప్పారు. నాని కూడా ఈ పాత్ర గురించి తెగ చెబుతున్నాడు. శ్రీనిధి అద్భుతంగా నటించిందని ప్రశంసలు కురిపిస్తున్నాడు. మామూలుగా ఇలాంటి మూవీస్ లో హీరోయిన్లు చనిపోతారు. ఈ విషయంలోనూ ప్రమోషన్స్ లో ఫజిల్స్ విసిరారు ఇద్దరు. అయితే మూవీలో శ్రీనిధి శెట్టికి ఓ భారీ ఫైట్ సీన్ ఉందని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లీక్ చేశారు. అంటే హీరోయిన్ పాత్రకు చాలానే ప్రాధాన్యం ఉంటుందని అనుకోవచ్చు. అందుకు తగ్గట్టే ప్రతి ప్రమోషన్ లోనూ శ్రీనిధి ఉండేలా చూసుకుంటున్నాడు నాని. తను కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తోంది. ఇప్పటికే 35కు పైగా ఇంటర్వ్యూస్ ను వివిధ భాషల్లో ఇద్దరూ కలిసి ఇచ్చారట. ఇదో రికార్డ్ అనే చెప్పాలి. నాని సొంత బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రాన్ని శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు.

ప్రస్తుతం శ్రీనిధి తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ అనే చిత్రంలో నటిస్తోంది. హిట్ 3 విజయం ఈ మూవీకి పెద్ద ప్లస్ అవుతుందని వేరే చెప్పక్కర్లేదేమో.

Tags:    

Similar News