పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అప్పుడప్పుడు సినిమాల్లో పాటలు పాడటం అంటే మంచి సరదా కూడా. ఇవన్నీ మాగ్జిమం జానపద గీతాలే ఉంటాయి. అలాంటి సందర్భాలు లేకపోయినా కొన్నిసార్లు అతని కోసం క్రియేట్ చేసిన సిట్యుయేషన్స్ కూడా సినిమాల్లో కనిపిస్తాయి. అయితే తాజాగా వచ్చిన హరిహర వీరమల్లు పాట వింటే ఇది కంప్లీట్ గా సిట్యుయేషనల్ సాంగ్ అనే అనిపిస్తుంది. పెంచలదాస్ రాసిన ఈ గీతాన్ని పవన్ కళ్యాణ్ అలవోకగా ఆలపించాడు. ప్యాన్ ఇండియా మూవీగా వస్తోన్న హరిహర వీరమల్లు కోసం అన్ని భాషల్లోనూ ఆ పాటను పవన్ కళ్యాణే పాడినట్టుగా మనకు వినిపించింది. కానీ నిజానికి అతను తెలుగులో మాత్రమే పాటను పాడాడు. మరి మిగతా భాషల్లో ఎవరు పాడారు అనుకుంటున్నారేమో.. వేరెవరూ కాదు. అతని గొంతుతోనే ‘ఏ.ఐ’టెక్నాలజీ ద్వారా పవన్ గొంతులానే ఉండేలాగా ఆ పాటను రెడీ చేశారు. దీంతో మిగతా భాషల్లోనూ ఆయనే పాడినట్టుగా మనకు అనిపించింది.. వినిపించింది. బట్ ఇదంతా టెక్నాలజీ మహిమ.
అసలంటూ చెబితే పవన్ కళ్యాణ్ ఒక్క పాటకే టైమ్ ఇచ్చే పరిస్థితి లేదు. అంత బిజీగా ఉన్నాడు. అలాంటిది ఐదు పాటలంటే ఈజీగా రోజంతా పడుతుంది. అందుకే ఇలా చేశారట. ఇక ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేస్తారు అని చెప్పినా.. ఆల్మోస్ట్ వాయిదా పడినట్టే అని తేలిపోయింది. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులను చాలా నిరుత్సాహానికి గురి చేసిన వార్తే.