Dil Raju : దిల్ రాజు వయొలెంట్ స్టెప్ ..?

Update: 2025-03-20 12:00 GMT

ఎవరైనా హిట్ సినిమా ఇస్తే ఆ దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి తమ బ్యానర్ లో సినిమాలు చేయించుకోవడం సాధారణ విషయం. కాకపోతే ఆ డైరెక్టర్ లో విషయం ఉండాలి అంతే. అలాగని అడ్వాన్స్ లు ఇవ్వగానే సినిమాలు చేస్తారనేం లేదు. ప్రియారిటీస్ ను బట్టి వెళ్లిపోతుంటారు. అయితే ఎవరో హిట్ కొట్టే దర్శకులను తెచ్చుకోవడం కాదు.. తనే ఛాన్స్ లు ఇచ్చి కొత్త దర్శకులను తయారు చేస్తూ ఇండస్ట్రీకి అందిస్తుంటాడు దిల్ రాజు. బట్ కొన్నాళ్లుగా ఈ బ్యానర్ కాస్త డల్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం తప్ప మిగతావన్నీ కాస్త ఇబ్బంది పెట్టినవే. ఈ టైమ్ లో దిల్ రాజు బలే నిర్ణయం తీసుకున్నాడు.

లాస్ట్ ఇయర్ డిసెంబర్ 20న కేరళను భయపెట్టిన దర్శకుడిని లాక్ చేసుకున్నాడు. మార్కో అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ ఈ యేడాది జనవరి 1న తెలుగులోనూ విడుదలై మంచి విజయమే సాధించింది. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పైనే మోస్ట్ వయొలెంట్ మూవీగా ఈ చిత్రాన్ని అభివర్ణించారు. సెన్సిబుల్ పర్సన్స్ అస్సలు చూడలేకపోతారీ చిత్రాన్ని. ఆ మూవీ డైరెక్టర్ హనీఫ్ ఆదేని. ఆ డైరెక్టర్ నే దిల్ రాజు లాక్ చేశాడు.

మామూలుగా దిల్ రాజు బ్యానర్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ ఎక్కువగా కనిపిస్తాయి. హనీఫ్ స్టైల్ చూసిన తర్వాత కూడా అతనితో సినిమా చేయబోతున్నాడు అంటే ఖచ్చితంగా మంచి నిర్ణయమే అని చెప్పాలి. ఏదైనా అప్పుడప్పుడూ పంథా మారుస్తుంటేనే రిజల్ట్ లు మారుతుంటాయి. దిల్ రాజు బ్యానర్ లో హనీఫ్ మళ్లీ వయొలెంట్ మూవీయే చేస్తాడు అని కాదు కానీ.. ఓ కొత్త కథను చెప్పే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ గానే వీళ్లు కలిసి ఉన్న ఫోటోతో పాటు తమ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తాం అని చెప్పారు. మరి హనీఫ్ ఎలాంటి కథ చెప్పబోతున్నాడో. 

Tags:    

Similar News