Dimple Hayathi: రంగు తక్కువని రిజెక్ట్ చేశారు: తెలుగమ్మాయి డింపుల్ హయాతి
Dimple Hayathi: విజయవాడలో పుట్టి పెరిగిన డింపుల్.. హీరోయిన్ అవ్వాలన్న కలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.;
Dimple Hayathi (tv5news.in)
Dimple Hayathi: మామూలుగా గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్‌గా వెలిగిపోవాలంటే అందంగా ఉండాలన్నది మొదటి రూల్‌గా భావిస్తున్నారు. చూడగానే కట్టిపడేసే అందం ఉంటే చాలు.. హీరోయిన్‌గా వెలిగిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కొంతవరకే ఇదే నిజం. అందుకే టాలెంట్ ఉన్న కూడా రంగు లేకపోవడంతో చాలామంది అమ్మాయిలు హీరోయిన్లు కాలేకపోతున్నారు. తాను కూడా అలాంటి ఒక స్టేజ్‌ను దాటేసి వచ్చానని అంటోంది ఈ అప్‌కమింగ్ హీరోయిన్.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలయినా మంచి సక్సె్స్‌నే అందుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా ప్లస్సే. ఇక ఇందులోని జర్రా జర్రా అనే ఐటెమ్ సాంగ్‌లో తళుక్కున మెరిసింది తెలుగమ్మాయి డింపుల్ హయాతి. ఈ పాటలో తన డ్యాన్స్‌కు, ఎక్స్‌ప్రెషన్స్‌కు అందరూ ఫిదా అయినా.. తాను కోరుకున్నట్టుగా హీరోయిన్ అవకాశాలు మాత్రం వెంటనే రాలేదు.
విజయవాడలో పుట్టి పెరిగిన డింపుల్.. హీరోయిన్ అవ్వాలన్న కలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ చాలామంది దర్శకులు తనను రంగు తక్కువగా ఉన్నందుకు రిజెక్ట్ చేసిన విషయాన్ని ఇటీవల బయటపెట్టింది ఈ భామ. ప్రస్తుతం తాను రవితేజ హీరోగా నటిస్తున్న 'ఖిలాడి' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి.. ప్రమోషనల్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన కారణంగా తన కెరీర్‌కు సంబంధించి పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది డింపుల్.
తనకు హీరోయిన్‌గా ఛాన్సులు రాకపోయినా.. గద్దలకొండ గణేష్‌లో పాట చేసిన తర్వాత పలు ఐటెమ్ సాంగ్స్ కోసం దర్శకులు తనను సంప్రదించారట. కానీ తాను తరువాత స్క్రీన్‌పై కనిపిస్తే అది హీరోయిన్‌గానే అనుకున్న డింపుల్.. పట్టుదలతో రవితేజ సినిమాలో ప్లేస్ కొట్టేసింది. కెరీర్ మొదట్లో అయినా కూడా తాను నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటాను అంటోంది డింపుల్.