2023 లో మోస్ట్ హైప్డ్ మూవీస్ లో మంగళవారం ఒకటి. ఈ మూవీ ట్రైలర్ కే మైండ్ పోయింది అందరికీ. ఆర్ఎక్స్ 100 తర్వాత మహా సముద్రంతో బాగా డిజప్పాయింట్ చేసిన దర్శకుడు అజయ్ భూపతి మంగళవారంతో మరో బ్లాక్ బస్టర్ కొడుతున్నాడు అని ట్రైలర్ కే ఫిక్స్ అయిపోయారు. ఒక భిన్నమైన నేపథ్యంలో అమ్మాయి కోణంలో చెప్పిన ఈ కథ ట్రైలర్ కు పూర్తి భిన్నంగా ఉన్నా ఆకట్టుకుంది. ట్రైలర్ చూసి ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేశారో అలాంటి అంశాలేం సినిమాలో కనిపించలేదు. అయితేనేం.. ఈ తరహా కథలు తెలుగులో చాలా అంటే చాలా కొత్త అనిపించుకున్నాడు. ప్రధాన పాత్ర చేసిన పాయల్ రాజ్ పుత్ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. తర్వాత ఈ చిత్రం అనేక అవార్డులు, రివార్డులు కూడా తెచ్చుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలూ అందుకుంది. ముఖ్యంగా అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే తర్వాత మేజర్ హైలెట్ సంగీతం, సినిమాటోగ్రఫీ.
లేటెస్ట్ గా మంగళవారం 2 గురించిన కబుర్లు చెబుతున్నాడు అజయ్ భూపతి. త్వరలోనే మంగళవారంకు సీక్వెల్ రూపొందిస్తామని అనౌన్స్ చేశారు. చిత్రంగా మంగళవారంతో విజయం అందుకున్నా అజయ్ భూపతి నుంచి మరో ప్రాజెక్ట్ ఇప్పటి వరకూ అనౌన్స్ కాలేదు. కాస్త లేట్ అయినా ఈ మూవీ సెకండ్ పార్ట్ తోనే వస్తాడు అనేలా ఈ అనౌన్స్ మెంట్ కనిపిస్తోంది. అంటే త్వరలోనే మంగళవారం 2 కూడా త్వరలోనే రాబోతోందనుకోవచ్చేమో.