Koratala siva : పవన్ కళ్యాణ్ తో సినిమా తప్పకుండా చేస్తా : కొరటాల
Koratala siva : భద్ర,బృందావనం, మున్నా సినిమాలతో రచయితగా ఫుల్ సక్సెస్ అయిన కొరటాల శివ.. మిర్చి మూవీతో దర్శకుడిగా మారాడు..;
Koratala siva : భద్ర,బృందావనం, మున్నా సినిమాలతో రచయితగా ఫుల్ సక్సెస్ అయిన కొరటాల శివ.. మిర్చి మూవీతో దర్శకుడిగా మారాడు.. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ , భరత్ అను నేను వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.. టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత ఫ్లాప్స్ లేని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం కొరటాల డైరెక్షన్ లో చిరంజీవి నటించిన ఆచార్య మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. రామ్ చరణ్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కానుంది. అయితే మూవీ ప్రమోషన్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా పైన స్పందించాడు.
గతంలో పవన్ కళ్యాణ్ కోసం కూడా మంచి సినిమా చేయాలని అనుకున్నట్టుగా తెలిపాడు.. దర్శకుడు కాక ముందుకే శ్రీమంతుడు తరహాలో పవన్ కళ్యాణ్ కోసం ఒక మంచి పాయింట్ అనుకున్నానని తెలిపాడు.. సమయం వస్తే ఆయనతో సినిమా కచ్చితంగా చేస్తానని కొరటాల వెల్లడించాడు.
వీరి కాంబోలో మూవీ త్వరగా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అటు ఆచార్య మూవీ తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు కొరటాల.