Colour Photo : సినిమా పూర్తయ్యేంతవరకు ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదట..

Colour Photo : కలర్ ఫోటో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను డైరెక్టర్ సందీప్ రాజ్ బయటపెట్టారు.;

Update: 2022-07-29 13:45 GMT

Colour Photo : కలర్ ఫోటో సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు రావడంతో ఆ మూవీ యూనిట్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా కలర్ ఫోటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్, యాక్టర్ సుహాస్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. కలర్ ఫోటో మూవీ షూటింగ్‌ మొత్తం పూర్తయ్యేవరకు బయట ఎవ్వరికీ సుహాస్ హీరో అని చెప్పలేదన్నారు సందీప్ రాజ్. అందరికీ సునిల్ హీరో అని చెప్పుకుంటూ వచ్చామన్నారు.

కొన్ని రోజుల తరువాత సుహాస్ హీరో అని తెలిసిన తరువాత.. సుహాస్ ఎందుకు రాహుల్ రామకృష్ణతో చేయొచ్చుగా.. పైగా చాందిని చౌదరిని ఎందుకు తీసుకున్నావని అందరూ ప్రశ్నించారన్నారు సందీప్. కానీ మేము అనుకున్నట్లే కలర్ ఫోటో హిట్ అయిందని.. ఆ క్యారెక్టర్‌కు సుహాస్ చాందిని మాత్రమే న్యాయం చేయగలరని వారిని మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News