Aditi Shankar: నా జీవితంలో కాఫీ కప్పులు, నిద్రలేని రాత్రులు ఎన్నో!: డైరెక్టర్ శంకర్ కూతురు
Aditi Shankar: దర్శకుడు శంకర్ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.;
Aditi Shankar (tv5news.in)
Aditi Shankar: దర్శకుడు శంకర్ ప్రొఫెషనల్ లైఫ్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. శంకర్ ఇద్దరు కూతుళ్లలో ఒక కూతురు ఐశ్వర్య.. ఇటీవల ఓ క్రికెటర్‌ను పెళ్లాడింది. ఇక రెండో కూతురు అదితి.. సినిమాల్లోకి రావడానికి సిద్ధమవుతోంది. ఒకపక్క సినిమా, మరోపక్క చదువును మ్యానేజ్ చేస్తూ.. అదితి డాక్టర్‌గా పట్టా అందుకుంది.
శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అదితి ఇటీవల డాక్టర్‌గా పట్టా అందుకుంది. ఎంతో కష్టపడిన తర్వాత తాను ఈ డిగ్రీని సంపాదించుకుంది అంటూ అదితి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో శంకర్ కూతురు మల్టీ టాలెంటెడ్ అంటూ అందరూ తనను అభినందిస్తున్నారు.
Here's to all the fun memories, late nights and mugs of coffee that got me here ✨ Officially Dr.Aditi Shankar #graduationday #endsandbeginnings pic.twitter.com/bws6Wlcy1O
— Aditi Shankar (@AditiShankarofl) December 11, 2021
సినిమాల విషయానికి వస్తే.. అదితి శంకర్ త్వరలోనే హీరోయిన్‌గా వెండితెరపై మెరవనుంది. ముత్తయ్య దర్శకత్వంలో 'వీరుమన్' అనే చిత్రంతో తాను కోలీవుడ్‌లో తెరంగేట్రం చేయనుంది. ఇందులో సూర్య తమ్ముడు కార్తీ హీరోగా నటిస్తున్నాడు. అటు డాక్టర్‌గా సక్సెస్ అయిన అదితి ఇటు యాక్టర్‌గా కూడా సక్సెస్ అవ్వాలని శంకర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.