బాలీవుడ్ డైరెక్టర్ అశ్వినీ ధిర్ కుమారుడు జలజ్ ధిర్(18) రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆయన వెళ్తున్న కారు ముంబైలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో జలజ్‌తో పాటు అతడి ఫ్రెండ్ కౌశిక్ మృతి చెందాడు. ప్రమాద సమయంలో జలజ్ మరో ఫ్రెండ్ సాహిల్ మద్యం సేవించి కారు నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అశ్వినీ ధిర్ ‘సన్ ఆఫ్ సర్దార్’ సహా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు.
నవంబర్ 23న ముంబయిలోని విలే పార్లేలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని సహారా స్టార్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తన స్నేహితులైన సాహిల్ మెంధా (18), సర్త్ కౌశిక్ (18), జెడాన్ జిమ్మీ (18)తో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో సాహిల్, జెడాన్ స్వల్ప గాయాలతో బయటపడగా.. సర్త్, జలజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. డ్రైవింగ్ చేస్తున్న సాహిల్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని ముంబయి పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో కారు 120 కిలోమీటర్లకు పైగా స్పీడుతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.