ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈసారి ప్యాన్ ఇండియా మూవీగా రాబోతోంది. ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ సెన్సేషనల్ హిట్ గా మారింది. మేకర్స్ ఇప్పుడు మూవీ సెకండ్ సింగిల్-మార్ ముంత చోడ్ చింత అప్డేట్ ఇచ్చారు.
మార్ ముంత చోడ్ చింత అనేది పాపులర్ డైలాగ్. రామ్ రెండు బాటిళ్ల కల్లును ఆస్వాదిస్తూ కనిపించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించారు.
'డబుల్ ఇస్మార్ట్' ఆగస్ట్ 10న గ్రాండ్ గా విడుదల కానుంది. రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా కనిపించనుంది.