ఎవరికైనా టైమ్ వస్తే వారి టైమ్ వారి చేతుల్లో లేనంత బిజీ అవుతారు అనేది సినిమా వాళ్లలో తరచూ వినిపించే మాట. ఆఫర్స్ రావడం కాదు. అవి హిట్ కావడం ఇంపార్టెంట్. టాలెంట్ మాత్రమే కాదు.. లక్ కూడా చాలా అవసరం. ఈ విషయంలో కొన్నాళ్ల క్రితమే టాలీవుడ్ ఆఫర్ అందుకున్నా హిట్ లేక ఎవరికీ తెలియకుండా పోయింది అస్సాం బ్యూటీ కయాడు లోహర్. బట్ లేటెస్ట్ గా వచ్చిన తమిళ్ మూవీ డ్రాగన్ తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయిందీ భామ. ఎక్కడ చూసినా తన గురించే సెర్చింగ్ లు. ఆల్రెడీ తెలుగులో విశ్వక్ సేన్ మూవీలో ఓ ఆఫర్ కొట్టేసింది. అటు కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ పెరుగుతున్నాయి. అందంతో పాటు నటనలోనూ ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ పాత్రలకూ ఎలాంటి అభ్యంతరాలు లేవని తన సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే తెలుస్తుంది. పైగా డ్రాగన్ లో ఉన్నంతలోనే అందాల ప్రదర్శనతో అదరగొట్టింది.
తను గతంలో చాలా అంటే చాలానే రీల్స్ చేసింది. ప్రస్తుతం ఆ రీల్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి. ఇంతటి అందగత్తెనా సినిమా వాళ్లు మిస్ అయ్యారు అని కామెంట్స్ చేస్తున్నారు. పైగా ఆల్రెడీ ఫేమ్ అయిన కొందరు బ్యూటీస్ తో కంపేర్ చేస్తూ కయాడు ముందు వాళ్లు దేనికీ పనికి రారు అంటున్నారు. ఇంకొందరు తన రీల్స్ లోని బెస్ట్ షాట్స్ ను కట్ చేసి వీడియోస్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇలా ఎలా చూసినా ఎక్కడ చూసినా డ్రాగన్ తర్వాత ఓవర్ నైట్ చాలామంది హాట్ ఫేవరెట్ అయింది కయాడు. మరి ఈ క్రేజ్ ను ఆఫర్స్ గా మలచుకోవడంలో అమ్మడు ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.