రీ రిలీజ్ ల ట్రెండ్ లో మరో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు ఎడిటర్ మోహన్. ఆయన సమర్పణ, నిర్మాణంలో రూపొందిన మూడు తెలుగు సినిమాలను ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఆ చిత్రాలను అప్డేట్ చేస్తూ.. కొత్త అనౌన్స్ మెంట్ ఇచ్చాడు. అయితే ఈ మూడూ కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. ముఖ్యంగా చిరంజీవి కెరీర్ చాలా డౌన్ ఫాల్ అయిన టైమ్ లో రూపొందించిన హిట్లర్ స్పెషల్ గా కనిపిస్తోంది. 1997లో విడుదలైన హిట్లర్ చిరంజీకి కమ్ బ్యాక్ మూవీ. అంతకు ముందు అన్నీ ఫ్లాపులతో కెరీర్ చాలా డీలా పడిపోయింది. అప్పుడే మెగాస్టార్ పని అయిపోయింది అన్న కామెంట్స్ బలంగా వినిపించాయి. వాటిని దాటుకుని తన ఇమేజ్ కు భిన్నంగా ఐదుగురు చెల్లెల్లకు అన్నగా మెగాస్టార్ నటించిన హిట్లర్ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే ఇదే అనిపించిన అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, ప్రీతి, కోవై సరళ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ చూసి నవ్వని వారంటూ లేరు. ఆ రేంజ్ ఎంటర్టైనర్ మరోసారి వస్తోందంటే ఆడియన్స్ కు నవ్వుల పండగే.
ఇక అర్జున్, జగపతిబాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన హను మాన్ జంక్షన్ ను కూడా మళ్లీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మూడు సినిమాల్లోనూ అద్భుతమైన వినోదంతో పాటు కుటుంబ విలువలు కనిపిస్తాయి. అలాంటి మూడు సినిమాలను త్వరలోనే రీ రిలీజ్ చేయబోతున్నాం అని అనౌన్స్ చేశారు. మరి ఈ ట్రెండ్ ఏదో కొత్తగా ఉంది. కాకపోతే స్టార్ కాస్ట్ ఉంటేనే రీ రిలీజ్ లకు క్రేజ్ ఉంటుంది. వీటిలో హిట్లర్ తప్ప మిగతా సినిమాల హీరోలు ఇప్పుడు ఎవరూ ఫామ్ లో లేరు. అయినా ఆడియన్స్ ను రప్పిస్తే ఆ కంటెంట్ కు ఇంకా వాల్యూ ఉందని అర్థం.