‘23’.. ఇదో మూవీ టైటిల్. మల్లేశం మూవీ ఫేమ్ రాజ్ ఆర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం విడుదలైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చరిత్రలో వేర్వేరు కాలాల్లో జరిగిన మూడు అరుదైన సంఘటనల సమాహారంగా ఈ మూవీ రూపొందిందని టీజర్ చూస్తే అర్థమైంది. ఆ సంఘటనలన్నిటినీ వీళ్లు ఎలా కన్విన్సింగ్ గా చెబుతారా అనే ఆసక్తి కూడా అందరిలోనూ కలిగింది. మరికొందరు ఇది ఒక వర్గం మూవీ అనే కంక్లూషన్ కు వచ్చారు కూడా. అవన్నీ ఎలా ఉన్నా.. ఈ చిత్రం టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందనే వార్తలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ఈ 23 సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు.
మార్క్ కే రాబిన్ సంగీతం అందించిన ఈ గీతాన్ని చంద్రబోస్ రాయగా కైలాష్ ఖేర్ ఆలపించాడు. బ్రతికే ఉన్నావని, ఊపిరి తీసుకుంటున్నావని తెలియాలంటే.. గాలి వీస్తున్నా, చీకటి చుట్టేస్తున్నా ఎగరాలి అంటూ ఓ మనిషిని ఉద్దేశిస్తూ పక్షిని ఆలంబనగా చేసుకుని రాసిన పాట. పాటంతా ఎక్కువగా ఆ కాలపు పత్తి మిల్లులో సాగుతోంది. భార్య భర్త అనుబంధాన్ని చూపిస్తుంది. తండ్రి కొడుకు బంధాన్ని చూపుతుంది. అన్నిటికీ మించి రియాలిటీకి అత్యంత దగ్గరగా ఉంది. పాటలో కనిపించిన ప్రధాన పాత్రధారుల జీవితాన్ని ఉద్దేశిస్తూ సాగే ఈ పాటను కైలాష్ ఖేర్ అద్భుతంగా ఆలపించాడు. చంద్రబో సాహిత్యం అదిరిపోయింది. మొత్తంగా టీజర్ తర్వాత వచ్చిన ఈ పాట మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతోందనేది అర్థమైంది. మరి సినిమా ఎలా ఉంటుందో కానీ.. ఇప్పటికైతే 23 మూవీ సంచలనంగానే కనిపిస్తోంది.