Family Dhamaka : ఇది మాస్ కా దాస్ ఆడించే ఫ్యామిలీ ఆట
ఫ్యామిలీ ధమాకాతో హోస్ట్ గా మారిన విశ్వక్ సేన్;
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇప్పటిదాకా ఓ నటుడిగానే ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు మరో కొత్త అవతారంతో ఆడియెన్స్ ను కనువిందు చేయనున్నాడు. ఇప్పుడు ఓ షోకు హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.
ఇటీవలే తన జీవితంలోని మరో ఘటాన్ని ప్రారభించబోతున్నానని చెప్పిన విశ్వక్ సేన్.. కుటుంబాన్ని స్టార్ట్ చేస్తున్నానని ఒక గ్రీటింగ్ కార్డును కూడా పోస్ట్ వేశాడు. దీంతో విశ్వక్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో తెగ పుట్టుకొచ్చాయి. ఇంతలోనే విశ్వక్ మరో సర్ఫ్రైజ్ తో ముందుకొచ్చాడు. ఆహా ప్రజెంట్ చేస్తోన్న 'ఫ్యామిలీ ధమాకా' పేరుతో రాబోతున్న ఓ స్పెషల్ షోకు విశ్వక్ హోస్ట్ గా చేయబోతున్నాడు. ఈ షోలో టాలీవుడ్ లోని పలు సెలబ్రెటీ ఫ్యామిలీస్ ని తీసుకొచ్చి విశ్వక్ ఒక ఆట ఆడించబోతున్నాడు. కాగా ఆహాలో ఇప్పటి వరకు ఎన్ని షోలు వచ్చినా బాలయ్య 'అన్‌స్టాపబుల్' మేనియాని మాత్రం డామినేట్ చేయలేకపోయాయి. మరి ఈ మాస్ కా దాస్ ఇలాకా 'అన్‌స్టాపబుల్' ని డామినేట్ చేస్తుందా లేదా చూడాలి.
ika chustharuga....
— ahavideoin (@ahavideoIN) August 15, 2023
'ఫ్యామిలీ ధమాకా', ఇది దాస్ కా ఇలాకా!! Mass ka Das aadinche Family aata..!👨👩👦👦🙅🏻♂️👨👨👧👦#FamilyDhamakaOnAHA, first ever game show for families,
Coming soon on aha 🔥@VishwakSenActor @rsbrothersindia @KhiladiOfficia3 @sprite_india @lalithaajewels @fremantle_india pic.twitter.com/KKra1GUG1Q
ఇక విశ్వక్ సేన్ సినిమా విషయాలకొస్తే.. రీసెంట్ గానే 'దాస్ కా ధమ్కీ' సినిమాతో మాస్ హిట్ కొట్టి మంచి ఫామ్ లో ఉన్న కుర్ర హీరో... ప్రస్తుతం వరుసగా మూడు సినిమాలు లైన్ లో పెట్టాడు. ఆయన చేస్తున్న సినిమాల్లో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే మూవీ ఒకటి. కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఇప్పటికే సినిమాపై అంచనాలు మరింతగా పెంచేశాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా నేహా శెట్టి సందడి చేయబోతుండగా.. సీనియర్ హీరోయిన్ అంజలి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా నుంచి ఈ మధ్యే ఫస్ట్ సాంగ్ కూడా విడుదలైంది. 'సుట్టంలా సూసి' అనే సాంగ్ ప్రోమో కూడా అందర్నీ తెగ ఆకట్టుకుంటోంది