Mrunal Thakur : ఫ్యామిలీ స్టార్ ... మృణాల్ సొంత డబ్బింగ్!

Update: 2024-03-22 04:39 GMT

 విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫ్యామిలీ స్టార్ కోసం డైరెక్టర్ పరశురామ్ పట్టు బట్టి మరీ మృణాల్ ఠాకూర్ తో సొంత డబ్బింగ్ చెప్పిస్తున్నట్లుగా సమాచారం.

పాత్రకున్న డిమాండ్ రిత్యా ఆమె డబ్బింగ్ చెప్తేనే బాగుంటుందని పరశురామ్ భావిస్తున్నాడట. నిర్మాత దిల్ రాజు కూడా అందుకు అంగీకరించడంతో.. ఇప్పటికే డబ్బింగ్ పనులు జరుగుతున్నట్లు మూవీ టీం నుంచి సమాచారం. మరి మృణాల్ తో డైరెక్టర్ పరశురామ్ ప్రయోగం ఫలిస్తుందా లేదా అనేది చూడాలి. కాగా ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ విడుదల కానుంది. సీతారామం, హాయ్ నాన్న సినిమాలు హిట్ తో జోష్ మీదున్న మృణాల్.. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ కొట్టాలని ప్లాన్ చేస్తోంది.

Tags:    

Similar News