Allari Naresh : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. రేపే ఫస్ట్ లుక్..!

Allari Naresh: నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.

Update: 2022-05-09 14:15 GMT

Allari Naresh: నాంది తర్వాత అల్లరి నరేష్ నుంచి వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. AR మోహన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

రేపు ఉదయం 11:02 నిమిషాలకిసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. అల్లరి నరేష్ 59 వ చిత్రంగా వస్తోన్న ఈ మూవీని హాస్య మూవీస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా, శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

అటు నరేష్ హీరోగా సతీష్ మల్లంపాటి దర్శకత్వంలో సభకు నమస్కారం అనే మరో సినిమా తెరకెక్కుతోంది. 

Tags:    

Similar News