లియో ఫస్ట్ లుక్ వచ్చేసిందోచ్
సింహాలు వేటాడి తిని వదిలేసిన మాంసాన్ని హైనాలు తింటాయి;
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న 'లియో' సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ సినిమాను ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్నారు. గురువారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యునిట్... లియో నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. లోకేష్ కనకరాజ్ విజయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. "పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా. మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. Have a Blast. లియో ఫస్ట్ లుక్ ను మీ పుట్టినరోజునాడు రిలీజ్ చేయడం సంతోషం" అని ట్వీట్ చేశారు.
లియో సినిమా.. లోకేష్ సినిమాటిక్ యునివర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో త్రిష, గౌతమ్ మీనన్, సంజయ్ దత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్... విజయ్ విశ్వరూపాన్ని చూపెట్టేలా ఉంది. రక్తం కక్కుతున్న ఆయుధంతో విరుచుకుపడగా.. పక్కనే హైనాలు, నక్కలు కనిపిస్తుంటాయి. అడవిలో సింహం పక్కనే నక్కలు, హైనాలు ఉండటం తెలిసిందే. సింహాలు వేటాడి తిని వదిలేసిన మాంసాన్ని హైనాలు తింటాయి. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో కూడా విజయ్ వేటాడుతున్నట్లు కనిపిస్తాడు. సినిమా పేరు కూడా లియో అని పెట్టడం... దానికి అనుగుణంగానే ఫస్ల్ లుక్ పోస్టర్ కూడా ఉండటం గమనార్హం. లియో నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ కావడంతో విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.