Trisha : ఫుల్ బిజీ.. డేట్స్ కుదరక రిజెక్ట్

Update: 2024-06-21 09:54 GMT

టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలోని అన్నీ భాషల్లో నటించింది హీరోయిన్ త్రిష ( Trisha ). గత 20 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించిన ఈ ముద్దుగుమ్మ .. తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాకపోతే కొంత కాలం క్రితం అవకాశాలు లేక కాస్త డీలా పడింది. ఇప్పుడు తిరిగి రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ఫుల్ బిజీగా మారిపోయింది. ఇవాల్టికి ఇండస్ట్రీలో తన తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

మళ్లీ సూపర్ ఫాం లోకి వచ్చి.. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో పి.ఎస్ 1, 2.. దళపతి విజయ్ తో లియో సినిమాలతో పాటు మరికొన్ని మూవీల్లో హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఇటు టాలీవుడ్ లోనూ నాలుగు సినిమాలు చేస్తోందట త్రిష. మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయట. ఇక ఇవన్నీ పూర్తయ్యే సరికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది.

ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు చేసేందుకు త్రిష ఒప్పుకోవట్లేదట. డేట్స్ కుదరక రిజెక్ట్ చేస్తుందట. రెండేళ్ల తరువాతనే తదుపరి సినిమాలకు సైన్ చేస్తానని చెబుతుందట. ఇదే సమయంలోనే రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచిందట ఈ బ్యూటీ. ఇక త్రిషకున్న సీనియారిటీ, ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఆమె అడిగినంత ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకుంటున్నారట. ఇక త్రిష చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ పైనా భారీ అంచనాలు ఉన్నాయి.

Tags:    

Similar News