Geethajali 2 OTT Release : ఓటీటీలోకి గీతాంజలి మళ్లీ వచ్చింది.. ఎప్పుడంటే ?
అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ 11న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ డేట్‌ని ఫిక్స్ చేసుకుందట. నెల రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్‌కు రాబోతుంది.
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైం సొంతం చేసుకుందట. దీంతో మే 10 నుంచి సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే అమెజాన్ నుంచి అప్‌డేట్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
దాదాపుగా పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి సినిమాకు సీక్వెల్‌గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషించగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించార. అంజలికి ఇది 50వ చిత్రం.