Ghoomer Trailer: సయామీకి గురువుగా అభిషేక్ బచ్చన్
'ఘూమర్' ట్రైలర్ రిలీజ్.. క్రికెటర్ గా సయామీ.. కోచ్ గా అభిషేక్ బచ్చన్;
ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్ రాబోయే చిత్రం 'ఘూమర్' విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి సయామీ ఖేర్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అభిషేక్ క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తాడు. అయితే తాజాగా ఈ సినిమా అధికారిక ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో సయామీ సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా మారేందుకు ఎదుర్కొన్న సవాళ్లను బాగా చూపించారు. అందుకు కోచ్ ఇచ్చిన సలహాలు, సూచనలు.. అవి ఎలా పనిచేశాయి.. వీటన్నింటినీ ఎదుర్కొని సయామీ ఎలా సక్సెస్ అయిందన్న విషయాలు మూవీపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
సయామి ఒక విషాదకరమైన ప్రమాదంలో ఒక చేయిని కోల్పోతుంది. దీంతో ఆమె కన్న కలలన్నీ చెదిరిపోతాయి. దీంతో సహాయం కోసం ఆమె అభిషేక్ వద్దకు వెళుతుంది. అతను ఆమెకు మెంటార్‌గా మారే క్రికెట్ కోచ్ పాత్రలో కనిపిస్తాడు. ఆమె క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఎడమ చేతితో మాత్రమే శిక్షణ పొందేందుకు సహాయం చేస్తాడు. అంగద్ బేడీ సయామి ప్రేమికురాలిగా నటిస్తుండగా, షబానా అజ్మీ ఈ చిత్రంలో ఆమె తల్లిగా చూపించారు. ఆద్యంతం స్ఫూర్తిదాయకంగా, ఇంట్రస్టింగ్ ను రేకెత్తించే ఈ ట్రైలర్.. అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.
T 4727 -YEEEAAAAAAHHHHHHH ... !!!!
— Amitabh Bachchan (@SrBachchan) August 4, 2023
Here’s a trailer that makes the heart and head spin.#GhoomerTrailer out now!https://t.co/ZiWkuHjn1f#GhoomerInCinemas on 18th August.#RBalki @AzmiShabana @juniorbachchan @SaiyamiKher @Imangadbedi #AnirudhSharma @vishalsinha_dop…
మహిళా క్రికెటర్ కథగా రానున్న ఈ సినిమాలో గాయం తర్వాత ఆ క్రీడను ఎడమ చేతితో ఆడడం నేర్చుకుని, తన కలను ఎలా ఆ క్రికెటర్ ఎలా నెరవేరుస్తాడన్న నేపథ్యంలో ఈ మూవీ రానుంది. అయితే సయామీ క్రికెటర్ పాత్రలో కనిపించనుండగా.. అభిషేక్ ఆమెకు కోచ్ గా నటిస్తున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. ఆయన అతిథి పాత్రలో కనిపించనున్నారు.
'ఘూమర్' గురించి..
వికలాంగ అథ్లెట్ల విజయాలను హైలైట్ చేసే స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా ఈ సినిమా రానుంది. అభిషేక్, సయామితో పాటు షబానా అజ్మీ, అంగద్ బేడీ కూడా ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బిషన్ సింగ్ బేడీ, అమితాబ్ బచ్చన్ సైతం ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Full View