Pawan Kalyan : పవన్ కళ్యాణ్ లేకుండానే పని కానిచ్చేస్తున్నారా..

Update: 2024-10-18 11:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ లోకి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ పై సీతకన్ను వేశాడు. ఆయన అభిమానులు కోరుకున్న విధంగా తను రాజకీయాల్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. అయితే సినిమాల విషయంలో మాత్రం ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అవుతున్నారు. పైగా ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ సగం సగం చిత్రీకరణ జరుపుకుని ఉన్నాయి. వాటినైనా ఫినిష్ చేస్తే బావుంటుంది అని కోరుకున్నారు. వారి కోసమే తిరిగి సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ముందుగా ఏఎమ్ రత్నం నిర్మిస్తూ.. ఆయన తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తోన్న ‘హరిహర వీరమల్లు’ను పూర్తి చేయబోతున్నాడు.

హరిహర వీరమల్లు ముందు క్రిష్ డైరెక్షన్ లో స్టార్ట్ అయ్యింది. బట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కావడంతో బాగా లేట్ అవుతోందని అతను తప్పుకున్నాడు. జ్యోతికృష్ణ దర్శకుడే కాబట్టి ప్రాజెక్ట్ ను అతను టేకోవర్ చేశాడు. రీసెంట్ గానే మళ్లీ చిత్రీకరణ మొదలైందీ మూవీ. అయితే పవన్ కళ్యాణ్ ఇంకా షూటింగ్ లో జాయిన్ కాలేదు. ప్రస్తుతం ఆయన లేని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్స్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఉంది. త్వరలోనే పవన్ వీరమల్లు సెట్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.

ఇక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నాడు. బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్నాడు. నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ కీలక పాత్రలు చేస్తున్నారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. 2025 మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల కాబోతోంది. 

Tags:    

Similar News