Harihara Veeramallu : వైజాగ్‌లో హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్టులుగా..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్ పొందింది. జులై 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తరువాత ఫస్ట్ వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాజకీయాల నేపథ్యంలో గత కొంతకాలంగా ఆయన సినిమాలు ఎక్కువగా లేకపోవడంతో పవన్ అభిమానులు నిరాశ చెందారు. మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరో స్క్రీన్ మీద కనిపించనుడడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
కాగా జులై 20న విశాఖపట్నంలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కొంత భాగం దర్శకత్వం వహించగా, మిగతా పార్ట్ ను ఏఎం జ్యోతికృష్ణ పూర్తిచేశారు. ఏఎం రత్నం నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా, చారిత్రక నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలతో ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ చిత్రంలో పవన్ కల్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, బాబీ డియోల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక పవర్ ఫుల్ సాంగ్ తో పాటు చిత్ర నిర్మాణ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.