అమర్ సింగ్ చంకీలా మూవీకి వస్తున్న స్పందనపై బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఎమోషనల్ అయ్యారు. ‘ఈ సినిమాలో నా పాత్రకు వస్తున్న స్పందనతో కన్నీరు ఆగడం లేదు. పరిణీతి ఈజ్ బ్యాక్ అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇది అస్సలు ఊహించలేదు. నేను తిరిగొచ్చేశా. ఎక్కడికీ వెళ్లను’ అని పేర్కొన్నారు.
27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన పంజాబీ గాయకుడు అమర్ సింగ్ చంకీలా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంజాబీ నటుడు దిల్జిత్ దొసాంజ్, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 12న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సినిమాపై ప్రశంసలు కురుస్తున్నాయి.
గతేడాది ఆప్ యువ నాయకుడు రాఘవ్ చద్ధాను పరిణీతి చోప్రా ప్రేమ వివాహం చేసుకొన్నారు. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు బై బై చెపుతారని నెట్టింట ప్రచారం జరిగింది. తాజా పోస్ట్‌తో ఆ ఊహాగానాలకు పరిణీతి చెక్ పెట్టారు. 2011లో విడుదలైన ‘లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’తో పరిణీతి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. కిల్ దిల్, డిష్యూం, గోల్‌మాల్ అగైన్, కేసరి, సైనా వంటి హిట్ చిత్రాలతో నటిగా తానేంటో నిరూపించుకున్నారు.