Pawan Kalyan : 500 మందితో పవన్ కళ్యాణ్ ఫైట్

Update: 2024-11-28 11:00 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పార్టీ శ్రేణులతో పాటు ఫ్యాన్స్ ను కూడా సంతృప్తి పరిచేందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా రెండు పడవలపై కాళ్లను బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి తను పొలిటికల్ గా అనుకున్నది సాధించాడు. ముందు ముందు ఇంకా చాలానే సాధించేది ఉంది. అయితే అభిమానులు సినిమాలు కూడా చేస్తే బావుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే వారికోసం ఎన్నికలకు ముందు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా ముందుగా ‘హరిహర వీరమల్లు -1’ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ .. షూటింగ్ ముందుగా ఫినిష్ కాబోతోంది.

హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్షన్ లో స్టార్ట్ అయింది. బాగా ఆలస్యం కావడంతో అతను తప్పుకున్నాడు. దీంతో నిర్మాత ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు. కొన్నాళ్లుగా చిత్రీకరణ వేగంగా సాగుతోంది. పవన్ టైమ్ ఇస్తే ఆయన సీన్స్ లేదంటే ఆయన లేని సీన్స్ ను చిత్రిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కళ్యాణ్ పై సినిమాకే హైలెట్ అనిపించే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.

ఈ యాక్షన్ సీక్వెన్స్ ను హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నిక్ పావెల్ ను తీసుకువచ్చారు. ఇందులో దాదాపు 500మంది వరకూ ఫైటర్స్ పాల్గొన్నారట. అంటే ఎంత పెద్ద యాక్షన్ సీక్వెన్సో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద యాక్షన్ సీక్వెన్స్ పవన్ కెరీర్ లో ఇదే ఫస్ట్ టైమ్ కావొచ్చు.

ఇక మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం చేస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్. బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, సచిన్ ఖేద్కర్, రఘుబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఫస్ట్ పార్ట్ ను 2025 మార్చి 28న విడుదల చేయనున్నట్టు గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఉన్నారు. 

Tags:    

Similar News