శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ రాబ ట్టిన ఈ మూవీ రెండోరోజు కూడా సత్తా చాటింది. తాజాగా మూడోరోజు కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు. 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. యూఎస్ లోనూ 1.7 మిలియన్ డాలర్లు వసూలు చేసినట్లు తెలిపారు. అయితే చిత్ర యూనిట్ అంచనాలకు మించి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందనను చూసి దర్శకుడు, నిర్మాతలు సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారు. కాగా.. వీకెండ్ ముగిసేసరికి రూ. 100 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తు న్నాయి. ఇక ఈ సినిమాలో నాని పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అర్జున్ సర్కారుగా తన పాత్రలో నాని అద్భుతంగా నటించాడు. కీలక సన్నివేశాల్లో ఆయన అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించాడు. వాల్ పోస్టర్ సినిమా, నాని యూనా నిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నే ని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైన సంగతి తెలిసిందే.