Nani HIT 3 Collections : మాసివ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న హిట్ 3

Update: 2025-05-02 10:06 GMT

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 ఊహించినట్టుగానే మాసివ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రిలీజ్ కు ముందు భారీ అంచనాలు పెంచాడు నాని. కంటెంట్ పై స్ట్రాంగ్ గా ఉన్నాడు. అతని కాన్ఫిడెన్స్ చూసి ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. ఆ రేంజ్ నమ్మకంతో కనిపించాడు. హిట్ మూవీ ఫ్రాంఛైజీలో వచ్చిన ఈమూడో చిత్రాన్ని కూడా శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. అయితే గత రెండు సినిమాల హీరోయిన్స్ లా కాకుండా ఈ సారి హీరోయిన్ కు కాస్త స్ట్రాంగ్ రోల్ ఇచ్చాడు. ఏకంగా ఆమెతో ఫైట్ కూడా చేయించారు.

మిక్కీ జే మేయర్ సంగీతం మరీ హైలెట్ కాకపోయినా మైనస్ అయితే కాలేదు. సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. జమ్మూ అండ్ కశ్మీర్ తో పాటు జైపూర్ ఎపిసోడ్స్ మెయిన్ హైలెట్ గా నిలిచాయి. అలాగే నాని మర్డర్స్ చేసే సీన్స్ కు ఆడియన్స్ కు మైండ్ పోతోంది. అంత క్రూరంగా ఎలా నటించాడా నాని అని ఆశ్చర్యపోతున్నారు. సెకండ్ హాఫ్ లో కొంత ఫోర్స్ డ్ వయొలెన్స్ లా అనిపించినా ఓవరాల్ గా నానిని ఈ కొత్త పాత్రలో చూడ్డానికీ ఇష్టపడుతున్నారు జనం అనేందుకు ఫస్ట్ డే వచ్చిన ఓపెనింగ్స్ నిదర్శనం.

హిట్ 3 కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్లు వచ్చాయి. ఇప్పటి వరకూ నాని కెరీర్ లో దసరా మూవీ ఫస్ట్ డే హయ్యొస్ట్ కలెక్షన్స్ తో ఉంది. హిట్ 3 దసరాను దాటేసింది. మొత్తంగా నాని ఈ చిత్రాన్ని తన భుజాలపై మోశాడు. అన్నీ తానై చూసుకున్నాడు. అందుకే ఇప్పుడు హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా ఫుల్ ఖుష్ అవుతున్నాడు. 

Tags:    

Similar News