Hollywood Film : 4 రోజుల్లో రూ.1,710 కోట్లు..దుమ్ములేపుతోన్న హాలీవుడ్ చిత్రం

Update: 2025-06-19 11:30 GMT

వరల్డ్ బాక్సాఫీస్ వద్ద హౌ టు ట్రెయిన్ యువర్ డ్రాగన్ హాలీవుడ్ చిత్రం దుమ్ములేపుతోంది. ఈ నెల 13న విడుదలైన ఈ మూవీ కేవలం నాలుగు రోజుల వ్యవధిలో నే రూ.1700 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఇండియాలో ఈ చిత్రం ఇంగ్లీష్ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ విడుదలవటం విశేషం. ఈ క్రమంలో ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 4 రోజుల్లో రూ.11.73 కోట్లు వసూళ్లు సాధించింది. జూన్ 13న మొదటి రోజే ఇండియాలో రూ.2.15 కోట్ల నెట్, 2వ రోజు రూ.4 కోట్ల నెట్, 3వ రోజు రూ.4.5 కోట్ల నెట్, 4వ రోజు రూ.1.40 కోట్ల నెట్ వసూళ్లు అందుకుంది. దీంతో ఇండియా నెట్ రూ.12.05 రూ. 1,290 కోట్లతో నిర్మాణం భారీ యానిమేషన్లు, భారీ తారాగణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రాన్ని డ్రీమ్ వర్క్స్ యానిమేషన్, మార్క్ ప్లాట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై 150 యూఎస్ఏ మిలియన్ డాలర్లతో నిర్మించారు. అంటే ఇది ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ చిత్రానికి రూ.1290 కోట్లు. మార్క్ ప్లాట్, ఆడమ్ సీగెల్ నిర్మాతలుగా వ్యవహరించారు. కోట్లకు చేరుకుంది. ఇక ఇండియా గ్రాస్ సాక్ నిల్క్ గణాంకాలు రూ.12.75 కోట్లు వసూళ్లు చేసిందని తెలుపుతున్నాయి.

Tags:    

Similar News