Mr.Bachchan Trailer: మిస్టర్ బచ్చన్ ట్రైలర్.. ఎలా ఉంది..?

Update: 2024-08-07 16:01 GMT

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమా మిస్టర్ బచ్చన్. 2018లో వచ్చిన బాలీవుడ్ మూవీ రైడ్ కు రీమేక్ ఇది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేశాడు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. గతంలో వచ్చిన టీజర్ చూస్తే ఒరిజినల్ ను పూర్తిగా మార్చేశారని అర్థం అయింది. లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చేశారు. మామూలుగా రీమేక్ అంటే హరీష్ చాలా మార్పులు చేస్తాడు. నేటివిటీ, హీరోల ఇమేజ్ లను బట్టి ఆ కథను మార్చేస్తుంటాడు. మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూస్తే కూడా అదే అనిపించింది.

' సరిహద్దు కాపాడేవాడే సైనికుడు కాదు.. సంపద కాపాడేవాడు కూడా సైనికుడే..' అనే డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ మొత్తం హరీష్ శంకర్ సినిమాలా కనిపిస్తోంది. ఈ మూవీ నైన్టీస్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. నిజాయితీ పరుడైన ఓ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ కథ ఇది. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్ కట్ కూడా ఉంది. కాకపోతే ఒరిజినల్ లేని అనేక అంశాలు యాడ్ చేశాడు దర్శకుడు. దీని వల్ల సీరియస్ నెస్ తగ్గిందీ కథలో. అయినా రవితేజ సినిమా అంటే ఇలాగే ఉండాలనే రూల్ ను ఫాలో అవుతూ ఈ చిత్రాన్ని రూపొందించానని హరీష్ శంకర్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఇది అచ్చంగా అలాగే కనిపిస్తోంది తప్ప.. ట్రైలర్ లో నిజాయితీ లేదు. కేవలం రవితేజ ఇమేజ్ ను ఎలివేట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు తప్ప.. ఒరిజినల్ మూవీలో ఉన్న ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హానెస్టీ కానీ.. ఒరిజినాలిటీ కానీ ఈ ట్రైలర్ లో లేదు. రొటీన్ అండ్ రెగ్యులర్ రవితేజ మార్క్ మాస్ ఎంటర్టైనర్ చూడబోతున్నాం అనే ఫీలింగ్ ను మాత్రం ఇచ్చిందీ ట్రైలర్.

ఖచ్చితంగా చెబితే హీరోయిన్ తో రొమాన్స్ పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారా అనే ఫీలింగ్ సాంగ్స్ తో వచ్చింది. ఈ ట్రైలర్ చూస్తే వాళ్ల అసలు ఉద్దేశ్యం కూడా హీరోయిన్ మీదుగా టికెట్స్ తెంపుకోవడమే అనిపిస్తోంది. మరి సినిమాలో అసలైన, బలమైన కంటెంట్ దాచి ట్రైలర్ కట్ చేశారా లేక ఇదే ఫైనల్ ట్రైలరా అనేది తెలియదు కానీ.. ఇదే ఫైనల్ అయితే రవితేజ ఫ్యాన్స్ కు పండగే.

Tags:    

Similar News