మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమా ఎల్ 2 ఎంపూరన్. లూసీఫర్ కు సీక్వెల్ గా వస్తోన్న ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశాడు. ఈ నెల 27న విడుదల కాబోతోంది. అయితే మొన్నటి వరకూ ఈ మూవీపై అస్సలు బజ్ లేదు అనే చెప్పాలి. కేవలం కేరళలో మాత్రమే హైప్ కనిపించింది. బట్ ట్రైలర్ తర్వాత అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా తిరుగులేని బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ లో ఫ్యామిలీ, పాలిటిక్స్, ఎమోషన్స్ తో పాటు మాస్ ను మెప్పించిన దర్శకుడు ఈ సారి ఇంటర్నేషనల్ మాఫియా, డ్రగ్స్ తో పాటు మరోసారి కేరళ పాలిటిక్స్ ను కూడా చూపించబోతున్నాడని ట్రైలర్ తో అర్థమైంది. ట్రైలర్ లో మరీ కొత్తగా కథేం కనిపించకపోయినా.. ఆ విజువల్ గ్రాండీయర్, స్టైలిష్ మేకింగ్, హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తుండటంతో మాస్ ఆడియన్స్ ఎంపూరన్ కోసం ఎగబడుతున్నారనే చెప్పాలి.
ఒక్కో రాష్ట్రంలో ప్రమోషన్స్ చేస్తూ వస్తోన్న ఈ టీమ్ రేపు(శనివారం ) హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించబోతోంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ప్రభాస్ వస్తాడు అనే ప్రచారం జరిగింది. నిజమా కాదా అనేది రేపు తెలుస్తుంది. మంజువారియర్, టోవినో థామస్, ఇంద్రజిత్ తో పాటు విదేశీ ఆర్టిస్టులు కూడా ఉన్నారీ చిత్రంలో. ఇప్పటి వరకూ సౌత్ నుంచి కేవలం తెలుగు, కన్నడ నుంచే ప్యాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. కోలీవుడ్ ప్రయత్నిస్తోంది కానీ వర్కవుట్ కావడం లేదు. బట్ తమిళ్ కంటే ముందు కేరళ నుంచి ఎంపూరన్ తో ప్యాన్ ఇండియా మూవీ రాబోతోందని ట్రైలర్ తో పాటు ప్రస్తుతం ఈ మూవీకి వస్తోన్న అద్భుతమైన స్పందన చూస్తుంటే తెలుస్తోంది. మరి మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతాడా లేదా అనేది ఈ నెల 27న తేలిపోతుంది.