పెహెల్గాం ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతటి విషాదం ప్రభావం చిత్ర సీమపై కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో పాకిస్తాన్ నటులను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ నేపథ్యం ఉండి భారతీయ సినిమాల్లో నటిస్తున్న తారలు సినిమాలు వీక్షించవద్దంటూ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రభాస్ నటిస్తున్న 'ఫాజీ' సినిమా కథానాయిక ఇమాన్వి నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు.
ఆమెది ఢిల్లీ అయినప్పటికీ ఆమె పుట్టింది పాకిస్తాన్ అని, ఆమె తండ్రి అక్కడ ఆర్మీ ఆఫీసర్ అని తేలడంతో టార్గెట్ చేస్తున్నారు. ఇమాన్ని అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఆమె నటిస్తున్న ఫౌజీ సినిమాను బాయ్ కాట్ చేయాలంటున్నారు. లేదా ఆమెను అందులో నుండి తొలిగించాలని కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఆందోళన పరిస్థితులు చల్లపడితే దీని గురించి అందరూ మర్చిపోయ్యే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.