K. Viswanath _ Koratala siva : ఒకే కథ.. మెప్పించిన కొరటాల.. ఆకట్టుకోలేకపోయిన కళాతపస్వి..!

K. Viswanath _ Koratala siva : ఇండస్ట్రీలో కొత్త కథలంటూ ఉండవు.. ఉన్నవాటినే కాస్త అటుఇటుగా మార్చి కొత్త ట్రీట్మెంట్ తో తీసేయడమే.

Update: 2021-11-10 14:17 GMT

K. Viswanath _ Koratala siva : ఇండస్ట్రీలో కొత్త కథలంటూ ఉండవు.. ఉన్నవాటినే కాస్త అటుఇటుగా మార్చి కొత్త ట్రీట్మెంట్ తో తీసేయడమే.. ఏ సినిమాని తీసుకున్న సరే అందులో వేరే సినిమాల తాలూకు మూలాలు కనిపిస్తుంటాయి. అయితే ఇందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం ఫెయిల్ అవుతుంటాయి. అలాంటి ఓ రెండు సినిమాలను ఇప్పుడు చూద్దాం..

కళాతపస్వి కే విశ్వనాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 1984 లో వచ్చిన చిత్రం 'జననీ జన్మభూమి'.. శ్రీ భ్రమరాంబికా ఫిల్మ్స్ పతాకంపై కోగంటి కేశ్వరావు నిర్మించారు. ఇందులో బాలకృష్ణ సరసన సుమలత హీరోయిన్ గా నటించింది. సత్యనారాయణ, శారద ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో హీరో ఓ కోటీశ్వరుడు. ఓ ఊరిని దత్తత తీసుకొని.. ఆ ఊరి ప్రజలను సారా,మద్యం నుంచి విముక్తి చేసి మంచి చేయాలని చూస్తాడు. చివరికి అతను అనుకున్న పని అయిందా లేదా అన్నది మెయిన్ కథ.. ఈ సినిమాని ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా చాలా సాదాసీదాగా తెరకెక్కించారు విశ్వనాథ్.. కానీ ఈ సినిమా ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు.

సరిగ్గా ఈ సినిమా వచ్చిన 31 ఏళ్ల తర్వాత ఇదే కథలోని మెయిన్ పాయింట్ ని తీసుకొని తనదైన ట్రీట్‌మెంట్‌తో మహేష్ బాబుతో 'శ్రీమంతుడు' అని తెరకెక్కించారు దర్శకుడు కొరటాల శివ. ఇందులోనూ మహేష్ బాబు కూడా శ్రీమంతుడే.. ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడమే.. కానీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా సినిమాకి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాతోనే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఏర్పడగా ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 

Tags:    

Similar News