మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా విశ్వంభర. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వశిష్ట తెరకెక్కించాడు. గత సంక్రాంతికే విడుదల కావాల్సిన మూవీ. కానీ విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సరిగా సెట్ కాలేదు. చిరంజీవి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడున్న టెక్నాలజీతో చూస్తే మరింత అద్భుతమైన ఫీల్ వచ్చేలా ఉండాలి. బట్ విశ్వంభర టీజర్ చూసి ఫ్యాన్స్ భయపడ్డారు. బ్యాడ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో మరోసారి ఆ వర్క్ ను చేస్తున్నారు. ఈ కారణంగా రిలీజ్ డేట్ పై క్లారిటీ లేకుండా పోయింది. కనీసం సమ్మర్ లో అయినా వస్తుందేమో అని ఆశించారు మెగాభిమానులు. బట్ నో క్లారిటీ.
ఫైనల్ గా విశ్వంభర విడుదలకు టైమ్ వచ్చింది అంటున్నారు. ప్రస్తుతం జురాసిక్ పార్క్ కు పనిచేసిన విఎఫ్ఎక్స్ టీమ్ ప్రస్తుతం విశ్వంభరకు వర్క్ చేస్తున్నారు అనే టాక్ ఉంది. ఆ వర్క్ చివరి దశకు వచ్చిందట. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీకి రావాలనుకుంటున్నారంటున్నారు. సమ్మర్ మొత్తం దాదాపు ప్యాక్ అయి ఉంది. పైగా ఐపిఎల్ కూడా సాగుతోంది. అటు ఆగస్ట్ లో కీలకమైన ఇండిపెండెన్స్ డేకు ఆల్రెడీ రిలీజ్ లు ఉన్నాయి. అందుకే చివరి వారం లేదా జూలైలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఆ డేట్ కూడా మాగ్జిమం ఫిక్స్ అయిందట. కాకపోతే ఇంకా ఓటిటి డీల్ ముగియలేదు. అందుకే ఆ డీల్ సెట్ అయితే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి.