Family Man 3 : ఫ్యామిలీమ్యాన్ 3 లో రాజీ డౌటేనా?

Update: 2024-05-09 05:49 GMT

ఇండియన్ వెబ్ సిరీస్ లో 'ఫ్యామిలీమ్యాన్' కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పటికే విడుదలైన రెండు సీజన్లు బంపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఫ్యామిలీ మ్యాన్ 3 ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే సీజన్ 2లో ఎల్.టి.టి.ఇ తీవ్రవాదిగా రాజీ పాత్రలో సమంత నటనకు మంచి స్పందన వచ్చింది. అందుకే ఈ పాత్రకు కొనసాగింపుగా.. ఫ్యామిలీమ్యాన్ 3లో సమంతకు ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడీ సినిమాలో రాజీ పాత్ర లేదనే టాక్ వస్తోంది. 'ఫ్యామిలీమ్యాన్ 3'లో సమంత నటించడం లేదని.. అందుకే ఇటీవల 'ఫ్యామిలీమ్యాన్ 3' ప్రకటనలో ఎక్కడా ఆమె పేరు కనిపించలేదని కొందరు అంటున్నారు. సమంత బిజీగా ఉండి పార్ట్ 3లో కనిపించడం లేదా ? లేకపోతే ఛాన్స్ మిస్సయిందా? మొత్తానికే రాజీ పాత్రను తొలగించారా? అనే చర్చ జరుగుతోంది. సీజన్ 3 కాస్టింగ్ లో మనోజ్ బాజ్పేయ్, ప్రియమణి సహా ఇతర కీలక పాత్రల పేర్లు కనిపించినా.. సమంత పేరు మాత్రం ఎక్కడా కనిపించలేదు. మయోసైటిస్ నుంచి బయటపడి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సమంత.. ఇప్పటి వరకూ బాలీవుడ్ ప్రాజెక్టులేవీ చేపట్టలేదు. టాలీవుడ్లో తన సొంత బ్యానర్ పై ఓ సినిమా చేస్తోంది.

Tags:    

Similar News