కొన్ని ట్రైలర్స్ చూడగానే బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతారు. అలా కట్ చేస్తారు వాటిని. సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలనేం లేదు. బట్ ట్రైలర్స్ మాత్రం గూస్ బంప్స్ అనేలా ఉంటాయి. తాజాగా వచ్చిన సన్నిడియోల్ ‘జాట్’ ట్రైలర్ కూడా అలాగే ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. మామూలుగా సౌత్ లో వచ్చే మాస్ మసాలా మూవీస్ ఎలా ఉంటాయో అలాంటి కంటెంట్ తోనే కనిపిస్తోంది. కానీ దీనికి సన్నీడియోల్ ఇమేజ్ యాడ్ అయింది. అందుకే చూడగానే నెక్ట్స్ లెవల్ అనిపించేలా ఉంది ట్రైలర్.
నార్త్ లో ఒకానొక ప్రాంతంలో రణతుంగ అనే రక్తం తాగే రాక్షసుడు. మనుషుల్ని హింసించడం.. చట్టాన్ని లెక్క చేయకపోవడం.. తనే సొంతంగా ఓ రాజ్యాన్ని తయారు చేసుకుని అత్యంత క్రూరంగా ఉండటం వంటివి చేస్తుంటాడు. అతడి దాష్టీకాలను ఎలివేట్ చేస్తూ నాగలితో పొలం దున్నే సీన్ చూస్తే చాలు.. అసలు ఈ సీన్ ను రాసుకున్న గోపీచంద్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. అలాంటి ప్రాంతానికి జాట్ అయిన సన్నీ వస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో చెప్పక్కర్లేదు.
ఓ పెద్ద రాక్షసుడి లాంటి విలన్. అత్యంత బలవంతుడైన హీరో. వీరి మధ్య వైరానికి కారణమయ్యే స్టఫ్ .. పోలీస్ స్టేషన్ వేదికగా కనిపిస్తోంది. అక్కడి నుంచి ఆ రణతుంగ లంకను జాట్ ఎలా విధ్వంసం చేశాడు అనేది పాయింట్. దాన్ని నెక్ట్స్ లెవల్ లో ఎలివేట్ చేస్తూ సాగే గోపీచంద్ స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లేను డబుల్ చేస్తూ కనిపిస్తోన్న యాక్షన్ సీక్వెన్స్ లు. వెరసి జాట్ ట్రైలర్ ఓ బ్లాక్ బస్టర్ లుక్ తో కనిపిస్తోంది.
రణ్ దీప్ హుడా విలన్ పాత్రలో నటిస్తోన్న ఈచిత్రంలో ఇంకా రమ్యకృష్ణ, రెజీనా కసాండ్రా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, స్వరూప ఘోష్ తదితరులు కనిపిస్తోన్న ఈ చిత్రంలో తెలుగు నటులు సైతం ఉన్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఇలాంటి మాస్ మూవీస్ కు అతని బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదేమో. మొత్తంగా గోపీచంద్ ఈ ట్రైలర్ తో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద బాలీవుడ్ అయిపోయాడు. మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయితే గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో కూడా భారీ డిమాండ్ వస్తుంది అని చెప్పాలి.