Veera Simha Reddy: 'వీరసింహారెడ్డి' నుండి జై బాలయ్య మాస్ సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ
Veera Simha Reddy: నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా సందర్భాలలో జై బాలయ్య అని నినాదాలు చేస్తారు.;
Veera Simha Reddy: నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులు చాలా సందర్భాలలో జై బాలయ్య అని నినాదాలు చేస్తారు.అవును మరి వారికి నిజంగా జై బాలయ్య ఒక భావోద్వేగం. ఈ రోజు, వీరసింహారెడ్డి యూనిట్ జై బాలయ్య యొక్క మొదటి సింగిల్ లిరికల్ వీడియోను అభిమానుల ఆనందం కోసం ఈ రోజు విడుదల చేశారు. ఇది బాలయ్య అభిమానులను సంతృప్తి పరిచే పక్కా మరో మాస్ గీతంగా రికార్డులు సృష్టిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
బాలకృష్ణకు అఖండతో బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ అందించిన ఎస్ థమన్ ఎనర్జిటిక్ బీట్స్‌తో డైనమిక్ నంబర్‌ను స్కోర్ చేశాడు. కథానాయకుడి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగే ఈ పాటలో బాలకృష్ణ క్లాస్‌గా, గంభీరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. అతని డ్యాన్స్ మూమెంట్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి.
ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. దీనిని గాయకుడు కర్రిముల్లా గానం చేశారు. ఈ పాటలోని మరో పెద్ద ఆకర్షణ ఏమిటంటే, బాలయ్య అభిమానిగా థమన్ ఊర మాస్ గెటప్‌లో కనిపిస్తారు.
మాస్ పల్స్ తెలిసిన గోపీచంద్ మలినేని బాలకృష్ణను మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వీరసింహారెడ్డి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.