Janhvi Kapoor : 'జనగణమన'లో జాన్వీ.. క్లారిటీ ఇచ్చేసింది..!
Janhvi Kapoor : బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..;
బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తెలుగు ఎంట్రీ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న'జన గణ మన' సినిమాలో ఆమె హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపైన ఆమె స్పందించింది.
"పుకార్లను నమ్మకండి.. నేనిప్పటివరకు ఏ తెలుగు, తమిళ్ సినిమాని కూడా ఓకే చేయలేదు.. ఒకవేళ ఏదైనా సినిమాకి సంతకం చేస్తే తప్పకుండా చెబుతాను" అని తెలిపింది. జాన్వీ ఇచ్చిన క్లారిటీతో ఇప్పట్లో ఆమె టాలీవుడ్ ఎంట్రీ లేనట్టే అని తేలిపోయింది.
కాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'జన గణ మన' ఆగస్ట్ 2023లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ మూవీని ఛార్మీ, వంశీపైడి పల్లి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆర్మీ, వార్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోంది. ఇక విజయ్-పూరీ కాంబినేషన్‌లో ఇప్పటికే తెరకెక్కిన లైగర్ మూవీ ఈ ఏడాది ఆగస్టు 25న విడుదల కానుంది.