Janhvi Kapoor : అందులో నేను వీక్ అన్న జాన్వి.. మండిపడుతున్న నెటిజన్లు..

Janhvi Kapoor : అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ ఓ సంచలన కామెంట్స్ చేశారు.;

Update: 2022-07-25 09:45 GMT

Janhvi Kapoor : అతిలోక సుందరి కూతురు జాన్వి కపూర్ ఓ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై నెటిజన్లు ఆమెను నాన్‌స్టాప్‌గా ట్రోల్ చేస్తున్నారు. జాన్వీ "గుడ్ లక్ జెర్రీ'' సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ఆమె ఓ చానెల్‌కు ఇంటర్వూ ఇస్తుండగా.. మధ్యలో.. తనకు మ్యాథమెటిక్స్ అంటే అస్సలు నచ్చదని.. కొందరు ఎందుకు దానికోసం బుర్రలు బద్దులుకొట్టుకుంటారు తెలియదని కామెంట్ చేసింది. క్యాల్యుకులేర్ వచ్చిన తరువాత లెక్కలు, ఆల్జీబ్రా చాలా సులువుగా అయిపోయింది.

నాకు లెక్కలంటే నచ్చదు.. చరిత్ర, లిటరేచర్ అంటే అమితమైన ఇష్టం అని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ సబ్జెక్టులు మనిషిని సంస్కారవంతంగా ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని చెప్పింది. మ్యాథమెటిక్స్ చదివితే ఆలోచన కుచించుకుపోతుందని ఘాటుగా చెప్పింది. మ్యాథ్స్ లవర్స్ జాన్విపై మండిపడుతున్నారు. ఆల్జీబ్రాని క్యాలుకులేటర్‌తో చేయోచ్చని జాన్వి చెప్పడంతో ఆమె లాజిక్ మిస్సైందని అర్థమవుతుందని నెటిజన్లు స్పందిస్తున్నారు. 

  

Tags:    

Similar News