ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆర్తి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి జయం రవితో ( Jayam Ravi ) ఉన్న అన్ని ఫొటోలను డిలీట్ చేయడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే, విడాకులపై వీరిద్దరూ ఇంకా స్పందించలేదు. ఈ ఏడాది ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన ధనుశ్- ఐశ్వర్య, జీవీ ప్రకాశ్- సైంధవి, ఇమ్మాన్ – మోనికలు విడాకులు ప్రకటించారు.
వీరి పెళ్లయి 15 ఏళ్లు అవుతుంది. మొన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా కనిపించారు. కానీ సడెన్ వీరి విడాకులు అంటూ వార్తలు వినిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఇది నిజమేనా అని తేల్చుకునే లోపే ఆయన భార్య ఆర్తి పెళ్లి ఫోటోలు డిలీట్ చేసింది. దీంతో వారి డైవోర్స్‌ని ఆర్తి పరోక్షంగా కన్‌ఫాం చేసిందేమో అంటున్నారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదటయ్యాయట.
ఇరు కుటుంబ సభ్యులు నచ్చచెప్పడంతో వారి మధ్య వచ్చిన కలతలను తొలగించుకునే ప్రయత్నం చేశారట. కానీ అది వర్క్ అవుట్ కాకపోవడంతో ఇక విడిపోవాలి నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కొద్ది రోజులుగా 'జయం' రవి ఆర్తిలు విడివిడిగా జీవిస్తున్నారట.