Aryan Khan Bail: ఆర్యన్ ఖాన్ బెయిల్‌లో జూహీ చావ్లా కీ రోల్..
Aryan Khan Bail:ముంబై డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైలులో గడపనున్నారు;
Aryan Khan bail (tv5news.in)
Aryan Khan Bail: ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ మరో రాత్రి జైలులోనే గడపనున్నారు. ఆర్యన్ తరపు న్యాయవాదులు శుక్రవారం గడువులోగా బెయిల్ పత్రాలను జైలు అధికారులకు అందించండంలో విఫలమవడంతో అతని విడుదల మరో రోజు ఆలస్యం కానుంది. కోర్టు అందించిన బెయిల్ పత్రాలను సాయంత్రం అయిదున్నర గంటలకు జైలు అధికారులకు అందించారు. అప్పటికే ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు.
అక్టోబర్ రెండున ముంబై తీరంలోని క్రూయిజ్ షిప్‌లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు జరిపి ఆర్యన్ తో పాటు ఐదుగురిని అరెస్ట్ చేశారు. అప్పటినుంచి ముంబైలోని అర్ధర్ రోడ్ జైలులో ఉన్న ఆర్యన్‌కు గురువారం నాడు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి ఉత్తర్వులను న్యాయస్థానం శుక్రవారం జారీ చేసింది.1 4 షరతులతో పాటు లక్ష రుపాయల పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో నటి జూహీ చావ్లా షూరిటీగా సంతకం చేశారు.
ఆర్యన్‌కు బెయిల్ రావడంతో షారుక్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అతడు విడుదలై వస్తాడనుకుని అభిమానులు పెద్ద ఎత్తున షారుక్ నివాసం మన్నత్‌కు వచ్చారు. అక్కడ పండగ వాతావరణం కనిపించింది. ఇటు కోర్టు ఉత్తర్వులను తీసుకుని న్యాయ బృందంతో స్వయంగా షారూక్ జైలుకు వెళ్లారు. అయితే రిలీజ్ ప్రాసెస్ ఆలస్యం కావడంతో షారుక్ తో పాటు అభిమానులు డిసప్పాంట్ అయ్యారు.