యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన తండ్రి నందమూరి హరికృష్ణ 69వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరినీ కదిలించింది. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఆయన తన తండ్రి గొప్పదనాన్ని, తమ జీవితంలో ఆయన స్థానాన్ని వివరించారు.
“ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు. ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే” అంటూ ఎన్టీఆర్ తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని అక్షరాల్లో పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారక్ అభిమానులు, నెటిజన్లు కూడా హరికృష్ణను గుర్తుచేసుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా 2018 ఆగస్టు 30న నల్లగొండ జిల్లా అన్నెపర్తి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలో ఒక అభిమాని పెళ్లికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.