Kajal Agarwal: బాలీవుడ్ హీరో బంపరాఫర్.. కాజల్‌కి కాల్..
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా భారీ ఆఫర్లు అందుకుంటున్న కాజల్ అగర్వాల్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తమిళ ఇండస్ట్రీ టాక్.;
Kajal Agarwal: దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా భారీ ఆఫర్లు అందుకుంటున్న కాజల్ అగర్వాల్‌కు మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తమిళ ఇండస్ట్రీ టాక్. వివాహం తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు పొందుతున్న ఈ బ్యూటీ తమిళంలో ఘన విజయం సాధించిన కార్తీ 'ఖైదీ' మూవీ రీమేక్‌లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
దర్శకుడు లోకేష్ కనకరాజ్ కెరీర్‌లోనే కాదు, కార్తీ కెరీర్‌లో కూడా అతిపెద్ద హిట్ చిత్రం 'ఖైదీ'. ఇది ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది.
అయితే, బాలీవుడ్ నేటివిటీకి అనుగుణంగా ఖైదీ కథలో మార్పులు చేస్తున్నట్లు సమాచారం. ఈ కథలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది. ముంబైలో కర్ఫ్యూ ఎత్తివేసిన తరువాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
కాజల్ అగర్వాల్ కెరీర్ విషయానికి వస్తే, ఆమె ఇటీవల ముంబై సాగాలో నటించింది. ఆమె నటించిన క్వీన్ రీమేక్ పారిస్‌లో విడుదల కానుంది. ఇండియన్ 2 లో కమల్ తో జతకట్టింది. నాగార్జునతో ఘోస్ట్లీ కబ్జా, చిరంజీవితో ఆచార్య, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో మూవీ చేస్తూ పెళ్లైన తరువాత కూడా బిజీగానే ఉంటోంది కాజల్.