Kajal Aggarwal : సౌత్ ఇండస్ట్రీపై కాజల్ హాట్ కామెంట్స్

Update: 2024-06-05 07:49 GMT

సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో తెరకెక్కిన చిత్రం సత్యభామ. ఈ సినిమా జూన్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ సౌత్ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ కు, సౌత్ ఇండస్ట్రీకి మధ్య చాలా తేడా ఉందని..దక్షిణాదిలో పెళ్ళయిన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వరంటూ చెప్పింది. దక్షిణాదిలో పెళ్ళయిన హీరోయిన్లను పక్కన పెట్టెస్తారని అభిప్రాయపడింది. బాలీవుడ్ లో ఐశ్వర్యరాయ్, దీపికా పదుకోణె, అలియా భట్ లాంటి వారికి అవకాశాలు పస్తున్నాయి. కానీ, సౌత్ లో అలాంటి పరిస్థితి అలా లేదని..ఇందుకు అతీతం హీరోయిన్ నయనతారే అని చెప్పుకొచ్చింది. ఈ విషయాలు కొత్తమీ కాదని, ఇంతకుముందు బాలీవుడ్కు వెళ్ళిన ఇలియానా, తాప్సీ, పూజా హెగ్దే వంటి హీరోయిన్లు సైతం ఇలాంటి కామెంట్లు చేశారని కాజల్ తెలిపింది. కాగా 2007లో లక్ష్మీ కల్యాణం సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన కాజల్.. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక వరుస సినిమాలతో కాజల్ సుడి తిరిగింది. ఆర్య 2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ ఫర్ ఫెక్ట్ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకుంది ఈ బ్యూటీ. ఇప్పుడు సత్యభామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ భామ ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. ఈ చిత్రాన్ని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి కలిసి నిర్మించారు. దీన్ని శశికిరణ్ తిక్క సమర్పిస్తున్నారు. ఇందులో ప్రకాశ్ రాజ్, నాగినేడు, హర్షవర్థన్, రవివర్మ, అమరేందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News