చిన్నవైనా కొన్ని సినిమాల ట్రైలర్స్ భలే అనిపిస్తాయి. ట్రైలర్ చూడగానే సినిమా చూడాలి అనేంత ఇంప్రెషన్ కలిగిస్తాయి. అలాంటి ఫీలింగ్ నే ఇస్తోంది కలి మూవీ ట్రైలర్. మీరు చదివింది కరెక్టే.. ఇది కల్కి కాదు.. ‘కలి’. ప్రిన్స్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ కేషు దర్శకుడు. లీలా గౌతమ్ వర్మ నిర్మాత. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను దర్శకుడు ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా విడుదల చేశారు.
ట్రైలర్ చూడగానే ఇదో సైకలాజికల్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది. అంటే అన్ని జానర్స్ కనిపిస్తున్నాయి. ఇన్ని జానర్స్ తో కూడా ఆకట్టుకునేలా ట్రైలర్ కట్ చేశారు. మనిషి పుట్టగానే జీవితం అనే శతృవును తెచ్చుకుంటాడు అనే డైలాగ్ త మొదలై.. ఒక వ్యక్తి జీవిత సంఘర్షణ నుంచి మరో వ్యక్తి అతనికి హితబోధ చేయడం వరకూ కనిపిస్తున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బిడ్డ పుట్టిన తర్వాత అతనికి కుటుంబాన్ని నడిపే శక్తి లేదని వెళ్లిపోతుంది. అప్పుడు అతని జీవితంలోకి మరో వ్యక్తి వస్తాడు. ఇతను చేసే ప్రతిదాన్ని ప్రశ్నిస్తాడు. అతనిదే తప్పు అంటాడు. ఈ కొత్త వ్యక్తి అలా చెప్పడం అతనికి నచ్చదు. ఇలా సాగుతుంది ట్రైలర్. చివర్లో కలి పురుషుడు లాంటి అవతారం గురించిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. క్వాలిటీ పరంగా బావుంది. ఆర్టిస్టుల సెటప్ ఆకట్టుకుంటోంది. మొత్తంగా ఓ కొత్త నేపథ్యంలో రూపొందిన సినిమాలా ఉంది ఈ ట్రైలర్ చూస్తోంటే. దసరా హాలిడేస్ లో అక్టోబర్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతోందీ మూవీ. మరి సినిమాగా ఎలా ఉంటుందో కానీ.. కలి ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా కనిపిస్తోంది.