Kalki 2898 AD Trailer : కల్కి 2898 ఏడీ ట్రైలర్.. ఈ డీటెయిల్స్ గమనించారా..?
మోస్ట్ ఎవైటెడ్ అప్ కమింగ్ సైఫై ఎపిక్ 'కల్కి 2898 ఏడీ', మ్యాసీవ్ అంచనాలతో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు.. ప్యాన్ ఇండియా లెవెల్ లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ లోని డీటెయిల్స్ సంచలనం రేపుతున్నాయి. నాగ్ అశ్విన్ చేసిన మ్యాజిక్ ఏంటో వెండితెరపై చూసేందుకు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
'కల్కి 2898 ఏడీ' సినిమాటిక్ యూనివర్సిటీని ఎక్స్ ట్రార్డినరీగా పరిచయం చేశారు. ట్రైలర్ ప్రేక్షకులను ఇండియన్ మైథాలజీ వరల్డ్ లోకి తీసుకెళ్ళింది. టాప్ క్లాస్ సైన్స్ ఫిక్షన్, వీఎఫ్ఎక్స్ అత్యద్భుతం అనిపించింది. సినిమా ట్రైలర్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ సహా పలు భాషల్లో చూడటానికి అందుబాటులో ఉంది. ఎలక్ట్రిఫైయింగ్ ట్రైలర్ , మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన యాక్షన్ పవర్ ని ప్రజెంట్ చేసి, అశ్వత్థామ పాత్రకు ప్రాణం పోశారు.
దీపికా పదుకొనే ప్రతి ఫ్రేమ్ ఎమోషన్స్ పలికించింది. దిశా పటాని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. కొత్త ప్రపంచం రాబోతోందని ఉలగనాయగన్ కమల్ హాసన్ చెప్పిన డైలాగ్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. కమల్ హాసన్ అద్భుతమైన పాత్రలో నిజంగా గుర్తుపట్టలేనంతగా కనిపిస్తున్నారు. ఫ్యూచర్ వెహికల్ తన బెస్ట్ ఫ్రెండ్ 'బుజ్జి'తో ప్రభాస్ తన పవర్-ప్యాక్ యాక్షన్, కెమిస్ట్రీతో అదరగొట్టారు. మూవీ డీటెయిల్స్ పై చేసిన వీడియోలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.