సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్ ను రాజ్యసభకు పంపేందుకు డీఎంకే కూటమి ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. తమిళనాడు నుంచి 18 మంది రాజ్యసభ సభ్యులుంటారు. ప్రతి రెండేండ్లకు ఒక సారి రొటేషన్ ప్రాతిపదికన పదిక కొందరు పదవీ కాలం ముగిస్తుంది. జులై 24తో ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. వాటిలో ఐదు స్థానాలు డీఎంకే కూటమికి దక్కుతాయి. అందులో ఒక స్థానాన్ని మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్ తో భర్తీ చేసేందుకు డీఎంకే సిద్ధమవుతోందని సమాచారం. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం, మక్కల్ నీది మయ్యం నాయకుడు కమల్ హాసన్ ను డీఎంకే కూటమి తరపున రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.