Indian 3 : కమల్ హాసన్ భారతీయుడు.. మళ్లీ వస్తున్నాడు

Update: 2025-06-19 11:45 GMT

కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా భారతీయుడు. శంకర్ కాబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే అంచనాతో తీసిని భారతీయుడు - 2 డిజాస్ట ర్ గా నిలిచింది. అటు శంకర్ ఇటు కమల్ హాసన్ కెరీర్ లో బిగెస్ట్ డిజాస్టర్ అయింది. తమిళ్ ఆల్ టైమ్ డిజాస్టర్స్ లో టాప్ ప్లేస్ లో సంపాదించిన ఈ సినిమాతో చాలా ముంది డిస్ట్రిబ్యూటర్స్ కుదేలైపోయారు. భయంకరమైన ఫ్లాప్ అయిన ఇండియన్ 2 కు సీక్వెల్ ఉంటుందని సినిమా చివర్లో ప్రోమో జత చేసి మరి ప్రకటించాడు దర్శకుడు శంకర్. కానీ ఇండియన్ 2 ఫ్లాప్ కారణంగా ఇక పార్ట్ 3 అనేది జరగని పని అనుకున్నారు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 3 షూట్ జరుగుతోందట. మరోవైపు ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే ఈ సినిమాను థియేటర్ రిలీజ్ కోసం కాదని కేవలం ఓటీటీలో మాత్రమే రిలీజ్ చేస్తారని కూడా వినిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తో శంకర్ సతమతమవుతున్నాడు. ఇండియన్ 3 స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ గా చేసి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడనే టాక్ వస్తోంది.

Tags:    

Similar News