Thug Life OTT : అప్పుడే ఓటిటికి థగ్ లైఫ్.. ఎప్పుడంటే..?

Update: 2025-06-10 10:30 GMT

కమల్ హాసన్ ఈ ఏజ్ లో ఊహించని పరాభవంగా థగ్ లైఫ్ మిగిలిపోనుంది. 65యేళ్ల కెరీర్ లో ఎన్నో మెమరబుల్ మూవీస్ తో లోక నాయకుడు అనిపించుకున్నాడు కమల్. అతను చేయని ప్రయోగం లేదు. ఇండియన్ సినిమా రేంజ్ ను తన నటనతో మార్చిన హీరోల్లో ముందు వరుసలో ఉంటాడు కమల్. అలాంటి కమల్ కు థగ్ లైఫ్ చాలా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. సరే ఏ హీరోకైనా డిజాస్టర్స్ కొత్త కాదు. కానీ ఈ చిత్రంలో అతని పాత్ర.. ఆ పాత్రను రాసుకున్న విధానానికి ఫ్యాన్స్ కూడా కోపంగా ఉన్నారు. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకూ కనీసం 100 కోట్లు కూడా సాధించలేకపోయింది అంటే ఇది పరాభవం కాక మరేంటీ. అంతకు మించి మణిరత్నం దర్శకత్వం కావడం వల్ల ముందు చాలా అంచనాలున్నాయి. అంచనాలను అందుకోవడం అటుంచి.. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి విపరీతమైన విమర్శలు ఫేస్ చేస్తున్నారు ఈ ఇద్దరు. ఇక ఇప్పుడు థియేటర్ సరిపోదు అన్నట్టుగా ఓటిటి కూడా మరో అవమానం చేయబోతోంది.

థగ్ లైఫ్ ఓటిటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది. మామూలుగా నెట్ ఫ్లిక్స్ లో సినిమా రిలీజయ్యాక ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ కు వస్తుంది. బట్ థగ్ లైఫ్ విషయంలో ఆ రూల్ ను బ్రేక్ చేయబోతోందీ సంస్థ. ఇప్పటికే సినిమాకు కమర్షియల్ గా బిగ్గెస్ట్ డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ ను ఓటిటిలో కూడా రిపీట్ చేయాలనుకోవడం లేదు ఈ సంస్థ. ఇప్పటికే అనేక థియేటర్స్ పూర్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి. అందుకే ఆ గ్యాప్ ను ఓటిటితో ఫిల్ చేయబోతోంది నెట్ ఫ్లిక్స్. అందుకే ఈ చిత్రాన్ని అన్ని ప్రాంతీయ భాషలతో కలిపి జూలై 3 నుంచి ఓటిటిలో స్ట్రీమ్ చేయబోతోంది నెట్ ఫ్లిక్స్. జూలై 3 అనేది ఇంకా అఫీషియల్ గా కన్ఫార్మ్ కాలేదు కానీ.. ఆల్మోస్ట్ ఆ డేట్ కు వస్తుందని ఖచ్చితంగా చెబుతున్నారు. సో.. కమల్ హాసన్, మణిరత్నం లాంటి లెజెండ్స్ మూవీని ఓ ఓటిటి ప్లాట్ ఫామ్ రూల్ కు అనుగుణంగా కూడా ఉండలేకపోయింది.

Tags:    

Similar News