Kamal Haasan : ఆల్ టైమ్ రికార్డ్ కొట్టిన కమల్ హాసన్

Update: 2024-09-21 05:00 GMT

లోక నాయకుడుగా తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్ కమల్ హాసన్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎన్నో ప్రయోగాలతో ఇండియన్ సినిమా హిస్టరీలో రేర్ యాక్టర్ అనిపించుకున్నాడు. నటనకు డిక్షనరీ లాంటి కమల్ 2022లో విక్రమ్ తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు దశాబ్దానికి పైగా సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డాడు. బట్ విక్రమ్ తో ఈ తరం కుర్రాళ్లను కూడా మరసారి తనదైన శైలిలో మెస్మరైజ్ చేశాడు. విక్రమ్ తో కమల్ హాసన్ మార్కెట్ మళ్లీ ఊపందుకుంది.

ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ అనే మూవీ చేస్తున్నాడు కమల్. దాదాపు 35యేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడం విశేషం. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కమల్ తో పాటు శింబు, త్రిష, ఫహాద్ ఫాజిల్, జోజూ జార్జ్, అశోక్ సెల్వన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఎలా చూసినా ఈ సినిమా క్రేజీ ప్రాజెక్ట్ అనిపించుకుంది. అనౌన్స్ మెంట్ టైమ్ లోనే విడుదల చేసిన వీడియో చూస్తే కమల్, మణిరత్నం కాంబోలో మరో క్లాసిక్ రెడీ అవుతోందనిపించింది. అది నిజమే అనేలా ఇప్పుడీ కొత్త రికార్డ్ క్రియేట్ అయింది.

కోలీవుడ్ హిస్టరీలోనే హయ్యొస్ట్ డిజిటల్ రైట్స్ థగ్ లైఫ్ కు వచ్చాయి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ 149 కోట్లు పలికింది. ఇది అక్కడ ఆల్ టైమ్ రికార్డ్ కావడం విశేషం. కమల్ తో పాటు అనేక ఎసెట్స్ కూడా ఉండటం కూడా ఈ డీల్ కు కలిసొచ్చిందని చెప్పాలి. మరి ఈ రికార్డ్ ను బీట్ చేసే హీరోలెవరో చూడాలి.

Tags:    

Similar News